తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

July 29, 2026


img

తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది.

2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన కార్యనిర్వాహక మెమోరాండంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే ఆ మెమోరాండం ఆధారంగా గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులు మాత్రం చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. కనుక ఇప్పటికే అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు అవరోధాలను సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తొలగించినట్లయింది. 

కనుక ఇకపై పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల విషయంలో మరెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా చేసింది. కనుక అన్ని అడ్డంకులు తొలగడంతో ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

అయితే భవిష్యత్తులో చేపట్టే కొత్త ప్రాజెక్టులకు మాత్రం తప్పనిసరిగా ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వులు లేదా ఆఫీస్ మెమోరాండంల ద్వారా పర్యావరణ చట్టాలను మార్చడం లేదా వాటికి మినహాయింపులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. 



Related Post