బెంగళూరులో టాక్సిక్‌ ట్రైలర్‌ లాంచ్ ఎప్పుడంటే...

July 29, 2026


img

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్‌ హీరోగా ‘టాక్సిక్‌’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్) ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా 40 భాషలలో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. కనుక ఈ సినిమా ట్రైలర్‌ లాంచింగ్ కూడా అట్టహాసంగా జరిపేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆగస్ట్ 8న బెంగళూరులో టాక్సిక్ ట్రైలర్‌ విడుదల చేయబోతున్నారు.   

‘టాక్సిక్‌’లో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ ఐదుగురు నటిస్తున్నారు. టాక్సిక్ పెద్దలకు (ఓన్లీ ఫర్ గ్రోన్ అప్‌డేట్‌ అడల్ట్స్) మాత్రమేనని చిత్రబృందం చేస్తున్న ప్రచారంతో  అలాంటి మ్యాటర్ ఏముందో చూడాలని అందరికీ ఆసక్తి కలిగింపజేస్తోంది.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్‌), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ తదితర భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష