విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ వదులుతున్న ఫస్ట్ గ్లిమ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇటీవల నారా రోహిత్, ఆ తర్వాత వెంకటేష్ ఫస్ట్ గ్లిమ్స్ తర్వాత తాజాగా ఈ సినిమాలో యువినా పార్ధవి పాత్ర పరిచయం చేస్తూ మరో వీడియో వదిలారు. వాటిలో వెంకటేష్ కామెడీ.. టైమింగ్ చూసి తీరాల్సిందే.
ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. ఇంకా రావు రమేష్, బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు దర్శకత్వం & స్క్రీన్‌ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేస్తున్నారు.
క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.