బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
అదివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనని హనుమకొండలోని రోహిణీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ వైద్యులు ఆయనకి అత్యవసర చికిత్స చేసి ప్రాణం కాపాడారు. కావారి సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అయనని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, కానీ అయన ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. గుండెపోటు వచ్చిన తర్వాత కొంతసేపు మెదడుకి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వలన మెదడుకి నష్టం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. నేడు మరోసారి ఆయన పరిస్థితిని సమీక్షిస్తామని యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.