పవన్ సాదినేని దర్శకత్వంలో సల్మాన్ దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి చిట్టి చిట్టి చీమ అంటూ సాగే పాట నేడు విడుదలైంది. శ్రీమణి వ్రాసిన ఈ పాటని జీవి. ప్రకాష్ కుమార్ స్వరపరిచి సంగీతం అందించగా రమ్య బెహార ఆలపించారు. ఈ సినిమాతో ‘సాత్విక వీరవల్లి’ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అలాగే సీనియర్ నటి శ్రుతీ హాసన్ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: గంగరాజు గుణ్ణం, కథ: పరవన్ సాదినేని, వసంత్ జుర్రు; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: సుజీత్ సారంగ్, ఆర్ట్: వంశీ కృష్ణ; ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమా, లైట్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమా నాలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.