హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈరోజు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనని చంచల్ గూడా జైలుకి తరలించారు.
తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ని న్యాయస్థానం తిరస్కరించింది.
ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ ట్రైనీ పోలీస్ అధికారి ఇటువంటి నేరారోపణలతో అరెస్ట్ కావడం, జైలుకి వెళ్ళడం చాలా శోచనీయమే. ఇది అయన కెరీర్, వ్యక్తిగత జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది.