త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో హనీష్, కావ్యా థాపర్ జంటగా నటించిన ‘నేను రెడీ’ నుంచి ఇటీవలే ‘కొంచెం కొంచెం’ అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. తర్వాత మెరుపులే మెరుపులే అంటూ సాగే రెండో పాట శుక్రవారం సాయంత్రం 7 గంటలకు విడుదల చేయబోతున్నారు.
ఈ పాటకు హీరో హనీష్ డాన్స్ చేస్తున్న ఫోటోతో సోషల్ మీడియా ద్వారా ఈవిషయం తెలియజేసింది చిత్ర బృందం.
ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే: త్రినాథ్ రావు నక్కిన; కథ, డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్; సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: నిజార్ షఫీ; కోరియోగ్రఫీ: శేఖర్ వీజే; ఆర్ట్: రఘు కులకర్ణి; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేశారు.
హార్నిక్ ఇండియా ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.