శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు మూడు వారాల పాటు సాగిన క్లైమాక్స్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తైనట్లు చిత్రబృందం ప్రకటించింది.
దీనిలో శర్వానంద్‌తో సహా 800 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. క్లైమాక్స్ కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం తెలియజేసింది.
ఈ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణకు ముందస్తు ఏర్పాట్లకు మూడు నెలలు పట్టిందని, ఈ సినిమాలో గంగ పాత్ర చేస్తున్న శర్వానంద్ ప్రతీరోజు మేకప్ వేసుకునేందుకు రెండున్నర గంటలు, తీసేందుకు సుమారు గంట సేపు ఓపికగా కూర్చునేవారని చిత్ర బృందం తెలిపింది.
1960లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో సాగే యాక్షన్ డ్రామాగా దీనిని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ సినిమాలో శర్వానంద్‌కు హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతీ నటిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని దర్శకుడు సంపత్ నంది చెపుతున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదలయ్యే అవకాశం ఉంది.