శివ నిర్వాణ-మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో సిద్దమవుతున్న ‘ఇరుముడి’ ఆగస్ట్ 21న విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించినప్పటికీ, అనివార్య కారణాల వలన వాయిదా పడవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కానీ ఇరుముడి ఆగస్ట్ 21నే విడుదల చేయబోతున్నామని మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి స్పష్టం చేసింది. తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామాగా ఇరుముడి అని తెలియజేస్తూ రవితేజ, బేబీ నక్షత్ర పోస్టర్ వేసింది.
ఈ సినిమాలో రవితేజకు భార్యగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే, బాబా భాస్కర్, కెమెరా: విష్ణు శర్మ, ఆర్ట్: భార్గవ నౌదండ్ల, స్టంట్స్: రామ్ లక్షణ్, రియల్ సతీష్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.