హైదరాబాద్‌ ఐటి కంపెనీలకు పోలీసుల విజ్ఞప్తి

July 30, 2026
img

హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో సైబరాబాద్ పోలీసులు మళ్ళీ నేడు కూడా ఐటి కంపెనీలకు తమ ఉద్యోగులను ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులను లాగ్ అవుట్ చేసి విడతల వారీగా ఇళ్ళకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా, అందరూ సురక్షితంగా ఇళ్ళు చేరుకునేందుకు ఐటి కంపెనీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఐటి కంపెనీలు తమ లొకేషన్, ఏయే సమయాలలో ఎంతమంది లాగ్ అవుట్ అవుతారనే విషయం ఈమెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా కార్యాలయానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఈరోజు సాయంత్రం అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు.   


Related Post