షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన రష్మిక

July 31, 2026


img

నేషనల్ క్రష్ రష్మిక మందన షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఒక డాన్స్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె జారిపడటంతో తుంటి ఎముకకు గాయమైంది. యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు అవసరమైన వైద్య పరీక్షలు జరిపి తుంటి ఎముకకు దెబ్బ తగిలిందని తెలిపారు. కనుక మందులు తీసుకుంటూ కనీసం ఆరు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. తుంటి ఎముకపై మళ్ళీ ఏ మాత్రం ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

కనుక అంత వరకు ఆమె భర్త విజయ్‌ దేవరకొండతో కలిసి చేస్తున్న ‘రణబాలి’, హీరోయిన్ ఓరియంటడ్‌ ‘మైసా’ రెండు సినిమా షూటింగ్‌లకు హాజరుకాలేరు. మైసాలో ఆమె పలు యాక్షన్ సన్నివేశాలలో నటించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన శిక్షణ కూడా తీసుకున్నారు. కనుక కోలుకున్న తర్వాత కూడా ఈ గాయం కారణంగా ఆ యాక్షన్ సన్నివేశాలలో నటించగలరో లేదో?


Related Post

సినిమా స‌మీక్ష