ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి ప్రధాన పాత్రలలో నటించిన ‘డిసి’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్; డైలాగ్స్: అరుణ్ మాథేశ్వరన్, ఫ్రాంక్లిన్ జాకబ్; సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: ముఖేష్ జి; ఎడిటింగ్: జి.కె. ప్రసన్న; ఆర్ట్: కన్నన్ ఎస్; స్టంట్స్: పీసీ స్టంట్స్; అదనపు స్క్రీన్‌ప్లే: అరుణ్ రంజన్ చేశారు.