శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, కయాదు లోహార్ జంటగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీర్తి సురేష్ ఐటెం సాంగ్‌కి డాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్, అల్యూమినియం ఫ్యాక్టరీలో దీని కోసం భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
నాని-కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’, ‘నేను లోకల్’ రెండు సినిమాలు హిట్ అయినందున, ఆమె సినిమాలో తప్పకుండా హిట్ అవుతుందనే సెంటిమెంట్‌తోనే ఈవిధంగా ఆమెను ఈ సినిమాలోకి తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాట చిత్రీకరణ కొరకు కీర్తి సురేష్ కేవలం రెండు రోజులు కాల్ షీట్ ఇచ్చినప్పటికీ ఆమెకు భారీ పారితోషికం సమర్పించుకొని మరీ ఈ పాటకి డాన్స్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.