ఇరుముడి నుంచి మృధు మధురంగా యాలాలోయాలలో..

August 04, 2026


img

శివ నిర్వాణ-మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌ చేస్తున్న ‘ఇరుముడి’ నుంచి ‘యాలాలోయాలలో...’ అంటూ సాగే రెండో లిరికల్ సాంగ్‌ విడుదలైంది. అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటకి జీవి. ప్రకాష్ కుమార్‌ సంగీతం అందించగా మరో సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహేబ్, సాధికతో కలిసి మృదుమధురంగా పాడారు.  ఈ పాటలో కుటుంబంలో అనుబంధాలను చక్కగా చూపిస్తూనే హీరో ‘ఇరుముడి’ దేని గురించి ధరించారో చూచాయగా చెప్పేశారు.   

ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామాయే ఇరుముడి.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్‌, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే, బాబా భాస్కర్, కెమెరా: విష్ణు శర్మ, ఆర్ట్: భార్గవ నౌదండ్ల, స్టంట్స్: రామ్‌ లక్షణ్‌, రియల్ సతీష్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి చేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్న ఇరుముడి ఇరుముడి ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష