తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ‘ఓ సుకుమారి’ జూలై 17న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ యువతికి ఉన్న వింత సమస్య కారణంగా పెళ్ళి జరుగదు. అలాంటి సమయంలో అమాయకుడైన యువకుడు ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఊళ్ళో అందరూ ఆమె గురించి దాచి పెట్టిన ఆ రహస్యం ఏమిటి? పెళ్ళి తర్వాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అన్నదే సినిమా ప్రధాన కథ.
ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, ఆనంద్, ఝాన్సీ, అంజిమామ, శివానంద్, కోట జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు.
భరత్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై నమ్మకంతో 5 భాషల్లో నిర్మించారు. కానీ తెలుగు ప్రేక్షకులనే ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ సుకుమారి ఓటీటీ ప్రేక్షకులనైనా ఆకట్టుకోగలదో లేదో?