రామ్ పోతినేని తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న రాపో23 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం పుదుచ్చేరిలో 15 రోజుల పాటు సాగే కీలక షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్‌లో సినిమా కథకు కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్లు, ఒక పాటను చిత్రీకరించనున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో ముందుగా ఓ పాటను చిత్రీకరించిన తర్వాత, ప్రముఖ స్టంట్ మాస్టర్ విక్రమ్ మోర్ పర్యవేక్షణలో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
రాపో సినిమాతిక్స్ బ్యానర్‌పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని సుమారు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్: తిరు; సంగీత దర్శకుడు: శామ్ సీఎస్, పని చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెల్లో ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.