ఇరుముడి ట్రైలర్‌.. ఆగస్ట్ 12న

August 09, 2026


img

శివ నిర్వాణ దర్శకత్వం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తున్న ‘ఇరుముడి’ ఈ నెల 21న విడుదల కాబోతోంది. కనుక ఇరుముడి ట్రైలర్‌కి ముహూర్తం, వేదిక ప్రకటిస్తూఒక పోస్టర్ విడుదల చేశారు. నో

ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో హీరోకి తాగుడు అలవాటున్నట్లు చూపారు. ఇప్పుడు వేటకత్తి నోటితో పట్టుకున్నట్లు ఒక ఫోటో, నుదుట విభూతి, నల్ల దుస్తులు ధరించిన అయ్యప్ప భక్తుడుగా కనిపిస్తున్న మరో ఫోటోని చూపారు. తద్వారా ఈ సినిమా కథ ఏమిటో చెప్పేశారు దర్శకుడు శివ నిర్వాణ.  

ఇరుముడి ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించబోతున్నారు. స్థానిక ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇరుముడి ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని తెలియజేశారు.    

ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామాయే ఇరుముడి.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్‌, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే, బాబా భాస్కర్, కెమెరా: విష్ణు శర్మ, ఆర్ట్: భార్గవ నౌదండ్ల, స్టంట్స్: రామ్‌ లక్షణ్‌, రియల్ సతీష్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి చేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ నిర్మిస్తున్న ఇరుముడి ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది. 



Related Post

సినిమా స‌మీక్ష