అసలే అతను అల్లరి నరేష్. పైగా ‘రంభ, ఊర్వశి, మేనక’ గురించి కలలు కంటే... ఎలా ఉంటుందో సోమవారం టీజర్ విడుదలైతే తెలుస్తుంది.
చంద్రమోహన్ దర్శకత్వంలో సిద్దమవుతున్న ఈ సినిమాలో డా.కామాక్షి భాస్కర్, సాయి కుమార్, వివా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన కుమార్, గగన్ విహారీ, అనిష్ కురువిళ్ళ, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: చంద్ర మోహన్ చింతాడ, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, కెమెరా: రామ్ రెడ్డి, డైలాగ్స్: నందు సవిరిగాన చేస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, ప్రసాద్ నిమ్మకాయల కలిసి నిర్మిస్తున్నఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదల కాబోతోంది.