రీల్స్ పిచ్చిలో కన్నబిడ్డను మరిచిపోయిందే!

August 08, 2026
img

దేశంలో చాలా మందికి రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. ఈ పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఇదిగో ఇప్పుడు మరో నిదర్శనం. 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ తన భర్త, పసి పిల్లాడితో కలిసి బైక్‌పై ఎక్కడికో వెళుతుండగా దారిలో ఓ వంతెనపై ఆగారు. అప్పుడు ఆమె భర్త ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండటంతో చేతిలో పిల్లాడిని కిందకి దించి, ఓ పాపులర్ హిందీ పాటకు డాన్స్ చేస్తూ షూటింగ్‌ చేయించుకుంది. 

ఆమె రీల్స్ చేస్తున్నప్పుడు పిల్లాడు మెల్లగా పాకుకుంటూ వంతెన అంచుకు చేరుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ పిల్లాడి తండ్రి చూసి పరుగున వెళ్ళి పట్టుకున్నాడు. తన కొడుకు వంతెనపై నుంచి కింద పడిపోయేవాడనే సంగతి తెలియని ఆమె రీల్స్ చేసుకుంది. 

అయితే అదే కెమెరాలో ఆమె వెనుక పిల్లాడు వంతెన అంచుకు చేరుకోవడం, తండ్రి వచ్చి పట్టుకోవడం కూడా రికార్డ్ అయ్యింది. 

కనీసం అప్పుడైనా ఆమె ఆ వీడియోని చూసుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. అందరూ అది చూసి బిడ్డని కూడా పట్టించుకోకుండా రీల్స్ చేసుకుంటున్న నువ్వు తల్లివేనా?అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. 

కానీ ఈవిధంగా కూడా తన వీడియోకి ఎక్కువ కామెంట్స్ వచ్చాయని సంతోషపడుతోందేమో? ఆ రీల్స్ పిచ్చి తల్లి.    

Video Courtesy: RTV 

Related Post