ఆగస్ట్ 9,10 హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

August 08, 2026
img

హైదరాబాద్‌ నగరంలో ఆషాడ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. అది, సోమవారం రెండు రోజులలో లాల్ దర్వాజా బోనాలు, కార్వాన్‌లో దర్బార్ మైసమ్మ బోనాలు, అంబార పేట్ మహంకాళి బోనాలు, చిలకలగూదలోని కట్ట మైసమ్మ, పోచమ్మల బోనాలు జరుగబోతున్నాయి.

కనుక ఈ ప్రాంతాలలో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం ప్రజలకు తెలియజేసింది.

పాతబస్తీలోని మహంకాళి లాల్ దర్వాజా బోనాలు ఆగస్ట్ 9 ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు వాహనాలు వేరే మార్గాలకు మళ్ళిస్తారు. ఆగస్ట్ 10న ఉదయం ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

ఈ ఆలయాల పరిసర ప్రాంతాలలో కొన్ని మార్గాలను పూర్తిగా మూసివేస్తారు. మరికొన్ని చోట్ల వాహనాలను ఇతర మార్గాలకు మళ్ళిస్తారు. కనుక నగర ప్రజలు ఈ రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలను గుర్తుంచుకొని తమ గమ్యస్థానాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేరుకోవాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం సూచించింది.

#HYDTPinfo
🚦 Traffic Advisory | Mahankali Temple, Amberpet

Commuters, please make a note of the Traffic Advisory in view of the celebrations at Mahankali Temple, Amberpet, Hyderabad.

📅 09.08.2026 from 06:00 AM to 10.08.2026 at 12:00 PM

Commuters and devotees are advised to… pic.twitter.com/EnlvQgK8x8
— Hyderabad Traffic Police (@HYDTP) August 8, 2026

Related Post