బంజారా హిల్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం

August 08, 2026
img

బంజారా హిల్స్‌ రోడ్ నం.10లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనం సెల్లార్‌లో వైన్ షాప్ గోదాములో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు మొదలయ్యి క్షణాలలో భవనం పై అంతస్తులకు వాపించాయి. సమాచారం అందగానే అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతుంటే, హైడ్రా, మిగిలిన అగ్నిమాపక సిబ్బంది కలిసి భవనంలో చిక్కుకున్న 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

సెల్లారులో ఎటువంటి గోదాములు ఉండరాదని, ఉంటే ఇలాంటి అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని అగ్నిమాపక శాఖ పదేపదే హెచ్చరిస్తున్నా కూడా గోదాములు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్‌లో గోదాములకు భారీగా అద్దెలు చెల్లించడం కంటే సెల్లార్లలో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో గోదాములు ఏర్పాటు చేసుకుంటే డబ్బు మిగులుతుందని వ్యాపారులు, గోదాములకు అద్దెలకు ఇస్తే భవన నిర్వహణ ఖర్చులకు పనికి వస్తుందని యజమానులు భావిస్తుండటం వల్లనే ఈవిధంగా జరుగుతోంది.

కానీ అగ్నిప్రమాదం జరిగిది భవనం దెబ్బ తింటుంది. పైగా మంటలలో చిక్కుకొని చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ప్రభుత్వమే సెల్లార్లలో గోదాములు ఏర్పాటు చేయకుండా కట్టడి చేయాల్సి ఉంటుంది.

Related Post