విశ్వనాథ్ అండ్ సన్స్: ట్రైలర్‌ చూసి తీరాల్సిందే!

August 07, 2026


img

 వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ కోలీవుడ్‌ నటుడు సూర్య, మమితా బైజు జంటగా చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్‌ నేడు నుంచి రెండవ లిరికల్ వీడియో సాంగ్‌ శనివారం విడుదలైంది. ట్రైలర్‌లో స్క్రీన్-ప్లే స్పీడ్, సూర్య, మమతా నటన, కామెడీ, భావోద్వేగాలు ప్రతీదీ దేనికదే గొప్పగా అనిపిస్తుంది. కనుక ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు మరింత పెంచిందని చెప్పక తప్పదు.       

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: వెంకీ అట్లూరి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌, కెమెరా: నిమిష రవి, ఎడిటింగ్: నవీన్ నూలి, కోరియోగ్రఫీ: శేఖర్ విజే, విజయ్‌ బిన్నీ, స్టంట్స్: వి వెంకట్ చేస్తున్నారు.  

శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. 

ఈ ఏడాది ఆగస్ట్ 14న విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష