ఒడిశా నుంచి మంచిర్యాల చేరిన మొదటి లోడ్ బొగ్గు

August 08, 2026


img

సింగరేణి సంస్థ తొలిసారిగా ఒడిశాలోని నైనీ కోల్ బ్లాకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అక్కడ తవ్వితీసిన బొగ్గు రైల్వే స్టేషన్‌ వేగన్ల ద్వారా తెలంగాణకు చేరుకుంది. నైనీ బ్లాక్ నుంచి మొట్టమొదటి లోడ్ మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి ధర్మల్ విద్యుత్ కేంద్రానికి (ఎస్‌టిపిపి)  శుక్రవారం చేరుకుంది. మొత్తం 59 బాక్స్ వ్యాగన్లలో సుమారు 4,000 టన్నుల నాణ్యమైన జీ-10 గ్రేడ్ బొగ్గు ఎస్‌టిపిపికి చేరుకుంది. 

నైనీ బ్లాక్ నుంచి మంచిర్యాల చేరుకున్న ఈ తొలి లోడ్ రైలుకి సింగరేణి అధికారులు, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం నేతలు పచ్చ జెండా ఊపి స్వాగతం పలికారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ కాంగ్రెస్‌ నేతలు దీనిపై హర్షం వ్యక్తం చేశారు. 

సింగరేణి సంస్థ 2015లోనే ఒడిశాలోని నైనీ కోల్ బ్లాకు దక్కించుకుంది. కానీ అటవీ, పర్యావరణ, రవాణా తదితర అనుమతులు లభించకపోవడంతో ఇంత ఆలస్యం జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి, బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ చొరవ తీసుకొని అన్ని అవరోధాలను తొలగించడంతో ఇన్నేళ్ళ తర్వాత నైనీ బొగ్గు తెలంగాణకు చేరుకుంది.


Related Post