సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్న ‘పళ్ళ బురుసు’ ట్రైలర్ నేడు విడుదలైంది. ట్రైలర్‌లో కామెడీ అదిరిపోయింది. కానీ కథ కేవలం పళ్ళ బురుసు మాత్రమే కాదు. అంతకు మించి చాలా ఉందని హింట్ ఇచ్చింది. వృద్ధులైన తల్లితండ్రుల పట్ల కొడుకులు ప్రేమగా, బాధ్యతగా మెలగాలనే సందేశం ఇవ్వబోతున్నారేమో?
ఉదయ్ చౌహాన్ దర్శకత్వం తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో తీసిన ప్రజ్వల్ యద్మ, గోమతి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం: ఉదయ్ చౌహాన్; పాటలు: సురేష్ గంగుల; సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: వినోద్ కె.బంగారి; ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి; కోరియోగ్రఫీ: విష్ణు ప్రిజర్వర్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య పిట్టీ, వివేక్ క్రిష్ణాని కలిసి సిద్ధం చేసిన ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది.