విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ వెనక్కి

August 07, 2026
img

తమిళనాడు సిఎం జోసఫ్ విజయ్ భార్య సంగీత మరో ట్విస్ట్ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్‌ వేసి సంచలనం సృష్టించిన ఆమె, ఇప్పుడు ఆ విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకొని మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు. నేడు ఈ కేసు విచారణ జరిగే ముందు ఆమె తరపు న్యాయవాది విడాకుల పిటిషన్‌ ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసినట్లు సమాచారం.

విజయ్, సంగీత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలు కలిసి కాపురం చేసిన తర్వాత, భర్త నటి త్రిషకు  గత కొంతకాలంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అనంతరం విడాకుల పిటిషదగ్గరవడంతో ఆమె భర్త నుంచి విడిపోయేందుకు సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ పిటిషన్‌ వెనక్కి తీసుకోవడంతో వీరిద్దరూ రాజీకి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు విజయ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఒకవేళ భార్య సంగీతతో రాజీ పది మళ్ళీ కలిసి జీవించేందుకు సిద్ధపడితే, రాష్ట్రంలో మహిళలు చాలా సంతోషిస్తారు. కానీ విడాకులు తీసుకొని నటి త్రిషతో సెటిల్ అయినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు కానీ ఆ స్థాయిలో ఉన్న విజయ్‌ ఆవిధంగా చేయడం సరికాదనే విమర్శలు వినిపించవచ్చు. 

Related Post