బావి నీటిలో అలలు!

August 07, 2026
img

సముద్రంలో అలలు ఎగసి పడుతుండటం అందరికీ తెలుసు. గలగలపారే నదీ ప్రవాహంలో చిన్నపాటి అలలు కూడా ఉండవు. అయితే గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీళ్ళు పెద్ద అలల్లా అటూ ఇటూ కదులుతుండటంతో అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అలాగని ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించలేదు. కనీసం భూప్రకంపనలు కూడా నమోదు కాలేదు.

కానీ మూడు నెలల క్రితం తవ్విన ఆ బావిలో అలలు వచ్చినట్లు నీళ్ళు వాటంతట అవే అటూ ఇటూ కదులుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో బావి పూర్తిగా నిండటంతో బావిలో అలలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నీళ్ళు బావిలో దిగువనే ఉండిపోయి ఉంటే ఈ విషయం ఇంత త్వరగా ఎవరి దృష్టికి వచ్చేది కాదేమో?

దీనిపై భూగర్భ శాస్త్రవేత్తలు స్పందిస్తూ, బహుశః నీటి అడుగున భూమి పొరల్లో ఉన్న వాయువులు లీక్ అవుతున్నందునే బావి నీరు ఇలా కదులుతుండవచ్చన్నారు. కానీ ఈ విషయం తెలుసుకున్న భూగర్భ జల పరిశోధనా సంస్థ (GWRI) నిపుణులు అక్కడకు చేరుకొని బావిలో అలలు ఏర్పడటానికి అసలు కారణాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Related Post