పూరీ-సేతుపతి స్లమ్ డాగ్.. టబూ గ్లిమ్స్‌

August 11, 2026


img

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి చేస్తున్న స్లమ్‌ డాగ్ టెంపుల్ స్ట్రీట్-33 సినిమాలో బాలీవుడ్‌ సీనియర్ నటి టబూ ఓ మఖ్యపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ గ్లిమ్స్‌ నిన్న విడుదలైంది. ఈ సినిమాలో ఆమె ఇన్‌కమ్‌ టాక్స్ డిప్యూటీ కమీషనర్‌ గౌరీ హెగ్డేగా నటిస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లో పరిచయం చేశారు. 

ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, టాబు, సంయుక్త, దునియా విజయ కుమార్‌, జరీనా వాహబ్, విటివి గణేశ్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: పూరీ జగన్నాథ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్‌,  కెమెరా: శ్యాం కే నాయుడు,  ఆర్ట్: ఆశిష్ తేజ, జానీ షేక్, ఎడిటింగ్: సంతోష్ నూజిల్లా చేశారు.  

పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణ రావు కలిసి జేబి మోషన్ పిక్చర్స్‌, పూరీ కనెక్ట్స్’ బ్యానర్లపై పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష