మావోయిస్టు బెడద వదిలిందనుకుంటే...

August 09, 2026


img

తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా సమసిపోయిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కానీ ఇప్పుడు దాని స్థానంలోకి మాదక ద్రవ్యాల సమస్య వచ్చి చేరిందన్నారు.  

రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయినందున వారి కార్యకలాపాలను అరికట్టడం కోసం ఇంతకాలం నిర్విరామంగా పని చేసిన గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ)ల సేవలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇతర నేరాల నియంత్రణకు వినియోగించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, సైబర్ నేరాలు, ఆహార కల్తీ వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని, వాటి కట్టడికి ఇప్పటికే ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని డీజీపీ తెలిపారు. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు అవసరమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

ప్రజాప్రతినిధులకు భద్రత తగ్గించడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, మావోయిస్టుల ముప్పు తగ్గిన నేపథ్యంలో ఆయా ప్రజాప్రతినిధుల భద్రతను సమీక్షించామని తెలిపారు.

ముప్పు స్థాయిని బట్టి వారి భద్రతను కొద్దిగా తగ్గించామే తప్ప పూర్తిగా తొలగించలేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల భద్రత విషయంలో ఎలాంటి రాజకీయకోణం లేదని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 


Related Post