బోనాల ఉత్సవాల సందర్భంగా నేడు హైదరాబాద్ అంతా చాలా సందడి నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి కూడా పాతబస్తీలోని మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ పరిసరాల్లో జరిగిన బోనాల వేడుకల్లో శివసత్తులు, భక్తులతో కలిసి బోనాల పాటలకు ప్రీతి రెడ్డి హుషారుగా డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు అక్కడున్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్నా అయన కూడా జీవితంలో ప్రతీ క్షణం ఆస్వాదిస్తుంటారు. తన పుట్టిన రోజున తమ కాలేజీలో భారీ ఫంక్షన్ నిర్వహించి భార్యతో కలిసి డాన్స్ చేశారు. పలు సందర్భాలలో అయన హుషారుగా డాన్స్ చేస్తుండటం అందరికీ తెలుసు. ప్రీతి రెడ్డి కూడా ఇలాంటి సందర్భాలలో హుషారుగా డాన్స్ చేస్తుంతారు. ఆమె డాన్స్ వీడియో చూస్తున్నవారు మామకు తగ్గ కోడలని మెచ్చుకుంటున్నారు.
మల్లారెడ్డి కోడలు మాస్ డ్యాన్స్
HYD: పాతబస్తీ మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటీవల కొణిదెల నిహారిక అమ్మవారిని దర్శించుకోగా, తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం… pic.twitter.com/wGqobjWpBq