ఆగస్టు 15న థియేటర్లలోకి హుషార్ పిట్టలు

August 11, 2026


img

టీనేజ్ ఆకర్షణలు, కోరికలనే ప్రేమగా భావించే టీనేజ్ పిల్లల మనస్తత్వానికి అద్దం పడుతూ, వాటి పర్యవసానాలను ‘హుషార్ పిట్టలు’గా తెరకెక్కించారు దర్శకుడు బిక్షు. ఈ సినిమాలో వాసవి గణేశన్, అన్ష్ ప్రధాన పాత్రల్లో, గోవర్ధన్, సునీత మనోహర్, రమేష్, అంజి వల్గుమన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 

నిన్న విడుదలైన హుషార్ పిట్టలు ట్రైలర్‌ చూసినప్పుడు టీనేజ్ పిల్లలున్న ప్రతీ కుటుంబం కనెక్ట్ అవుతుంది. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: భిక్షు, సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: రుద్ర సాయి, ఆర్ట్: గాడె శివకుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్‌ చేశారు. 

ఈ సినిమాని రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై కె. వెంకట్ యాదవ్ నిర్మించారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష