హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం విషాద ఘటన జరిగింది. సంతోష్ కుమార్ (39) అనే మెకానిక్ బస్సు చక్రాల కింద నలిగి చనిపోయాడు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బస్సు బ్రేకులు సరిచేయాలని డ్రైవర్ చెప్పడంతో సంతోష్ కుమార్ తన పరికరాలతో బస్సు కిందకు వెళ్ళి సరిచేశాడు. అయితే అతను బస్సు కింద నుంచి బయటకు వచ్చేశాడనుకున్న డ్రైవర్ బస్సును ముందుకు నడపడం టైర్ల కింద నలిగి సంతోష్ కుమార్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు జీడిమెట్ల డిపో చేరుకొని కేసు నమోదు చేసి, సంతోష్ కుమార్ మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. బస్సు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.