తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత ఆ వివరాలు కంప్యూటర్లలోకి ఎక్కించి డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ వాటిలో 73.50 లక్షల ఓట్లు (21.5 శాతం ) వివిధ కారణాల వలన డిజిటలైజేషన్ జరుగలేదు. చనిపోయినవారి పేరిట ఉన్న ఓట్లు, రెండు చోట్ల ఓటు హక్కున్నవారు, ఇంకా చిరునామాలో లేని వ్యక్తుల ఓట్లు మరో 61 లక్షలున్నాయి.
ఇవి కాక 2002 జాబితాలతో తాజా లెక్కలు, వివరాలు బేరీజు వేసుకొని చూసినప్పుడు మరికొన్ని వేల ఓట్లు తేడా వచ్చినట్లు తెలుస్తోంది. కనుక ఈనెల 17న అటువంటి ఓటర్లకు నోటీసులు పంపించినప్పుడు, ఎన్నికల కమీషన్ గుర్తించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించి తమ ఓటు హక్కు కాపాడుకోవాలి. లేకుంటే ఓటర్ల జాబితాలో వారి పేరు ఉండదు.
ఏవిధంగా చూసినా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సర్ ప్రక్రియలో తుది జాబితా ప్రకటన తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.