బీసీ మహిళలకు శుభవార్త!

August 12, 2026


img

తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లోని బీసీ మహిళలకు ఓ శుభవార్త చెప్పారు. వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించబోతున్నట్లు ప్రకటించారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 1,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అర్హులైన బీసీ మహిళలకు ఉచితంగా అందించనున్నారు. వీటితో మహిళలు ఇంటి వద్ద నుంచే టైలరింగ్ పని చేసుకుంటూ ఆదాయం పొందగలుగుతారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. 

ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, వయోపరిమితి, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి తదితర అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 



Related Post