ఈ వయసులో ఇలాంటి డ్రామాలు అవసరమా? త్రిష

August 12, 2026
img

ప్రముఖ నటి త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మెసేజ్‌లు పెట్టారు. ఇటీవల తంజావూరు సభలో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఆమె గురించి అసభ్యంగా మాట్లాడారు. అందుకు పోలీసులు ఆయనని అరెస్ట్ చేయగా బెయిల్‌ తీసుకొని బయటపడ్డారు.

త్రిష అప్పుడే ఘాటుగా స్పందిస్తారనుకుంటే మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలో స్పందిస్తే తన వలన ఇంకా రచ్చరచ్చ అవుతుందని, అప్పుడు సిఎం విజయ్‌కి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసివస్తుందని సంయమనం పాటించి ఉండవచ్చు. ఆ వ్యవహారం సద్దుమణిగింది కనుక ఇప్పుడు త్రిష మెసేజ్ పెట్టి ఉండవచ్చు. 

ఇంతకీ ఆమె ఏం మెసేజ్ పెట్టారంటే, “ఈ వయసులో ఇలాంటి డ్రామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వెళ్ళి కాస్త డబ్బు సంపాదించుకొని ప్రశాంతంగా జీవించు”, “ఒకప్పుడు ఎటువంటి గొప్ప జీవితం కావాలని ప్రార్ధించారో అది లభించడం ఎంత అదృష్టమో?” 

అయితే ఆమె నేరుగా ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించ లేదు కనుక వీటిపై ఆయన లేదా డీఎంకే పార్టీ స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి. 

Related Post