హాస్టల్‌లో విషాదం.. పాము కాటుతో ముగ్గురు బాలికలు మృతి!

August 11, 2026
img

మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లా జప్తలై గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను పాము కాటేసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ 8, 12, 14 ఏళ్ల ముగ్గురు బాలికలు మృతి చెందారు.

మరో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుకునే విద్యార్థుల భద్రతపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు.. వారు నివసించే హాస్టళ్లలో కనీస భద్రతా ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

పాములు, విషపురుగులు సంచరించే ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లకు పటిష్టమైన భవనాలు, పరిశుభ్రమైన పరిసరాలు, కిటికీలకు మెష్‌లు, తగిన వెలుతురు వంటి కనీస సదుపాయాలు కల్పించాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్యం అందించే వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలి కదా?

Related Post