బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే ఉంటారు. చులకనగా మాట్లాడుతూనే ఉంటారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు కొండల్ రెడ్డికి రూ.200 కోట్లు విలువైన భూమిని కట్టబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక మాజీ సిఎం సిద్ధరామయ్య తన భార్యకి మూడెకరాలు కేటాయించినందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ సిఎం రేవంత్ రెడ్డి వందల కోట్ల విలువైన భూములు తన కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నారు. కేటీఆర్ ఏమన్నారో అయన మాటల్లోనే..
రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని
ఒక్క ఉద్యోగి లేని తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి కంపెనీకి రాసిచ్చిన అనుముల రేవంత్ రెడ్డి!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥 pic.twitter.com/CkN6jzGGEx