ముంబై మాఫియాపై ఆర్జీవీ కొత్త సినిమా.. పోలీస్ కంపెనీ

August 11, 2026


img

ఒకప్పుడు చక్కటి సినిమాలతో అందరినీ మెప్పించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అయితే తనకు ఇష్టమైన, కలిసొచ్చిన ‘ముంబై అండర్‌వరల్డ్’ నేపధ్యంతో ‘పోలీస్ కంపెనీ’ అనే పేరుతతో ఓ కొత్త సినిమా తీయబోతున్నట్లు వర్మ ప్రకటించారు. ఇది ‘డీ-కంపెనీ’ కంటే ఇది చాలా ప్రమాదకరమైనది’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆర్జీవీ ప్రకటించారు.

1990ల చివర్లో, 2000వ దశకం ప్రారంభంలో ముంబైలో గ్యాంగ్‌వార్‌లు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్క్వాడ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆ స్పెషల్ స్క్వాడ్‌లో కీలకంగా పనిచేసిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ అధికారి దయా నాయక్ పాత్రను హర్షవర్ధన్ రాణే పోషించనున్నారు.

నాటి కొన్ని వాస్తవ సంఘటనలు, పోలీస్ ఆపరేషన్లు, ముంబై అండర్‌వరల్డ్‌కు సంబంధించిన అంశాలతో వర్మ మార్క్ క్రైమ్‌ అండ్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించాగాలరో లేదో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష