మిస్సింగ్ మేఘన నుంచి ఫస్ట్ సాంగ్.. 13న

August 11, 2026


img

వాచస్పతి దర్శకత్వంలో ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమాలో రామ్‌ కార్తీక్, వైదిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘పిల్లా పిల్లా..’ అంటూ సాగే మొదటి పాటను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే: వనరాజ్; సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్; కెమెరా: శ్యాం కే నాయుడు; డైలాగ్స్: వెంకట్ బాదిగం; పాటలు: ఆర్‌ ఆర్‌ ధృవాన్; ఆర్ట్ డైరెక్టర్‌: గురు మురళీకృష్ణ; ఎడిటింగ్: బసవ; ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్ చేస్తున్నారు. 

ఫస్ట్ కాపీ మోవీస్, కేడి అండ్ కో బ్యానర్లపై నరేష్ బాబు పంచుమర్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవెళ్ల శ్రీనివాసరావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష