ఇల్లు కట్టుకున్నారు.. ప్రాణం తీసుకున్నారు!

August 12, 2026
img

ఇల్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు.. అని ఊరికే అనలేదు పెద్దలు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ (38) జీవితం భార్య మేఘన, ఇద్దరు పిల్లలు అయాన్ష్ (9) మిథున్ (7)లతో సాఫీగా సాగిపోతోంది. అ దంపతులకు సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వారి జీవితాలను తలక్రిందులు చేసింది. 

ఇంటి నిర్మాణం కోసం నరేష్ రూ.90 లక్షలు అప్పు చేశాడు. తర్వాత ఇంటిపై లోన్ తీసుకొని ఆ బాకీ తీర్చేయవచ్చని అనుకున్నాడు. చకచకా ఇల్లు కట్టేశాడు. కానీ ఇంటిపై లోన్ రాలేదు. దాంతో అప్పుల బాధ భరించలేక ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆ ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. అయినా ఇంకా అప్పులు ఉండిపోయాయి. దాంతో ఒత్తిడి భార్యాభర్తలు ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. నరేష్ ఇంట్లో ఉరేసుకొని చనిపోగా, మేఘన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తల్లీ తండ్రీ ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో వారి పిల్లలు అనాధలయ్యారు. 

ప్రతీ మనిషికి ఇల్లు, పెళ్ళి రెండూ అవసరమే. కానీ అవి లేకపోయినా జీవించవచ్చు. కానీ వాటి కోసం ఇలా శక్తికి మించి అప్పులు చేసి తీర్చగలమని అనుకుంటేనే జీవించడం కష్టం. ఆ కష్టాలు భరించలేనప్పుడు ఇలా అర్ధంతరంగా జీవితం ముగించాల్సి వస్తుంది. ముఖ్యంగా వారిపైనే ఆధారపడిన ఆ చిన్నారుల పరిస్థితి ఇప్పుడు ఏమిటి?

Related Post