సినీ పరిశ్రమలో ఉన్నవారిలో కొందరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తుంటారు. కానీ ‘నా భార్య బస్సు కండక్టర్‌తో లేచిపోయిందని ఎవరూ చెప్పుకోరు.
కానీ మళయాళ సినీ నటుడు అఖిల్ తన భార్య కట్టుబట్టలతో పరాయి వ్యక్తితో అర్ధరాత్రి లేచిపోతున్నప్పుడు సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోని కూడా మీడియాకు రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అయితే ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య పరాయి వ్యక్తితో లేచిపోవడంపై అఖిల్ స్పందన కూడా అనూహ్యంగానే ఉంది. ఆమె నన్ను వద్దనుకొని నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అంతే. ఇందుకు నేను ఆమెను తప్పు పట్టను. దేవుడు నాకు ఇలా రాసి పెట్టాడు. అంతే!ప్రతీ మనిషి జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిలో ఇది కూడా ఒకటని స్వీకరించక తప్పదు. ఇలాంటి సమయంలో నా తల్లితండ్రులు నాకు కొండంత అండగా నిలబడ్డారు. అది నా అదృష్టమే కదా?ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం,” అని అన్నారు.
ఈ ఘటనపై సమాజం ఏమనుకుంటుందని భయపడుతూ ఉంటే జీవితాంతం బాధపడుతూనే జీవించాలి. కానీ అఖిల్ చాలా ధైర్యంగా, హుందాగా వ్యవహరించి ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుండటం మెచ్చుకోవాల్సిందే.