నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా నాని, కీర్తి సురేష్ కలిసి చేసిన స్పెషల్ సాంగ్ త్వరలో విడుదల కాబోతోంది.
ఈ నెల 26 లేదా 27న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన పెద్ద సెట్స్‌లో ఈ స్పెషల్ సాంగ్‌ని ఇటీవలే షూటింగ్ చేశారు. ప్రస్తుతం దాని ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తి కాగానే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహర్ నటించగా విలన్ ‘శికంజ మాలిక్’గా మోహన్ బాబు, ‘బిర్యాని’గా సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: తోట శ్రీనివాస్, కెమెరా: సిహెచ్ సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేస్తున్నారు.
దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై దర్శక నిర్మాతలకు చాలా భారీ అంచనాలున్నాయి. కనుక తొలిసారిగా బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్‌లో 24న విడుదల కాబోతోంది.