మొబైల్‌తో జాగ్రత్త.. మూడు లక్షలు ఖర్చయ్యాయి: షకీలా

August 13, 2026
img

మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించవద్దని నటి షకీలా సూచించారు. మంచంపై పడుకుని గంటల తరబడి ఫోన్‌లో రీల్స్, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వల్ల తన మెడకు తీవ్ర సమస్య వచ్చిందని ఆమె తెలిపారు. ఆ నొప్పి భరించలేక ఇటీవల మెడకు సర్జరీ చేయించుకున్నానన్నారు. శస్త్ర చికిత్స తర్వాత ఆస్పత్రిలో ఉన్న ఫోటోని కూడా ఆమె తన పోస్టుకి జోడించారు. 

 తాను పక్కకు తిరిగి పడుకుని గంటల తరబడి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసేదానినని, ఆవిధంగా ఎక్కువసేపు పక్కకు తిరిగి పడుకొని ఫోన్ చూస్తుండటం వలన మెడపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి అది పెద్ద సమస్యగా మారిందని తెలిపారు.

మొబైల్‌ ఫోన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల డబ్బు ఖర్చవడం మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని షకీలా అన్నారు. 

తనకు మూడు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది పైగా చాలా నొప్పి భరించాల్సి వచ్చిందని తెలిపారు. ఫోన్ చాలా ఉపయోగకరమైనదే అయినప్పటికీ అవసరానికి మించి ఉపయోగించవద్దని షకీలా సూచించారు. 

ముఖ్యంగా మంచంపై పడుకుని ఫోన్ చూడటం, గంటల తరబడి రీల్స్, వీడియోలు చూడటం మానుకోవాలని చెప్పారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తన అనుభవం నుంచి ప్రతి ఒక్కరూ మొబైల్‌ వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని షకీలా సూచించారు.

Related Post