నాడు కేసీఆర్‌ కాళ్ళు పట్టుకొని కాంట్రాక్టులు పొందావుగా?

August 13, 2026


img

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇటీవల  హనుమకొండలో ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ సభలో మాట్లాడుతూ కేసీఆర్‌ హయంలో చేసిన అప్పుల కారణంగా రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. బీఆర్ఎస్‌ పార్టీ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందంటూ,” విమర్శించారు. అదే వేదికపై ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయనని అడ్డుకునే ప్రయత్నం చేశారు కూడా.   

పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “నాడు కేసీఆర్‌, కేటీఆర్‌ కాళ్ళు పట్టుకొని మొత్తం కాంట్రాక్టులన్నీ తీసుకుని బాగా సంపాదించుకున్నారు. వాళ్ళిద్దరి దయతోనే నేడు నువ్వింత ఉన్నతస్థాయికి ఎదిగావనే విషయం మరిచి వాళ్ళపైనే విషం చిమ్ముతున్నావు. ఒకవేళ వారు నీకు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇవ్వకుంటే నీ పరిస్థితి ఏమిటి? నేడు నువ్వు ఎక్కడ ఉండేవాడివి?

బీఆర్ఎస్‌ పార్టీ వలన లబ్ది పొంది ఈ స్థాయికి ఎదిగిన నువ్వు కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అసలు సిసలైన కాంగ్రెస్‌ నాయకుడులా బిల్డప్ ఇస్తున్నావు. ఈ లెక్కన పదేళ్ళపాటు కాంగ్రెస్‌ జెండా మోసిన నేతలు, కార్యకర్తలు ఏ స్థాయిలో ఉండాలి?

నువ్వు, నీలాగ వేరే పార్టీల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బొంద పెడుతున్నారు. మిమ్మల్ని ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు గ్రహిస్తే మంచిది,” అంటూ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 

ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...    


Related Post