శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తున్న ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదలైంది. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ‘ఇరుముడి’లో హీరో అయ్యప్పమాల వేసుకోవడం శబరిమల వెళ్ళేందుకే అయినా అక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుందని ట్రైలర్‌లో చూపారు.
ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. బేబీ నక్షత్ర చాలా సహజంగా నటించింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించింది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే, బాబా భాస్కర్, కెమెరా: విష్ణు శర్మ, ఆర్ట్: భార్గవ నౌదండ్ల, స్టంట్స్: రామ్ లక్షణ్, రియల్ సతీష్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ నిర్మిస్తున్న ఇరుముడి ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.