క్రైమ్ థ్రిల్లర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అమెజాన్ ప్రైమ్‌లో 2018లో విడుదలై సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌కు ఇది సినిమా రూపం. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్ భారతీయ ఓటీటీ చరిత్రలోనే కల్ట్ క్రైమ్ డ్రామాగా గుర్తింపు పొందింది.
మూడు సీజన్లుగా ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్‌లోని కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా పాత్రలు చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు అవే పాత్రలు, అదే కథను మిర్జాపూర్:ది మూవీగా మార్చి థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, రసికా దుగ్గల్, శ్వేతా త్రిపాఠి, రవి కిషన్, అభిషేక్ బెనర్జీ, జితేంద్ర కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. కొన్ని వారాల క్రితం విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ బ్యానర్లపై రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు.