బీఆర్ఎస్‌ నేత రేగ కాంతారావు అరెస్ట్

August 13, 2026
img

లైంగిక వేధింపుల కేసులో బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావును పంజాగుట్ట పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయన ఓ మహిళని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గత నాలుగేళ్ళుగా లైంగికంగా వాడుకుంటున్నారు. కనుక తనను పెళ్ళి చేసుకోవాలని ఆ మహిళ ఒత్తిడి చేయడంతో తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను బయట పెడతానంటూ బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని బాధిత మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది.

ఆమె పిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగా అయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి హైకోర్టుని ఆశ్రయించారు. కానీ హైకోర్టు అయన పిటిషన్‌ని తిరస్కరించి, పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. కానీ అయన అజ్ఞాతంలోనే ఉన్నారు.

పోలీసులు అయన మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. పోలీస్ బృందం వెంటనే బెంగళూరు వెళ్ళి అయనని అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తీసుకు వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత జరుగబోయే రిమాండ్, కస్టడీ, బెయిల్‌ పిటిషన్స్ వంటి పరిణామాలు అందరికీ తెలిసినవే. 

Related Post