హైదరాబాద్‌లో గంజాయి ఇంతగా వ్యాపించిందా!

August 13, 2026
img

బుధవారం ఈగల్ పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో తనికీలు, విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. వైద్య పరీక్షలలో 17 మంది విద్యార్ధులు గంజాయి సేవించినట్లు తేలింది. పాశ్చాత్యదేశాలలో విద్యాసంస్థలలో గంజాయి సాధారణమే అనిపించవచ్చు. కానీ మన దేశంలో చాలా అసాధారణం.. ఆశ్చర్యకరమే అని భావించవచ్చు. 

యువత గంజాయికి ఎంతగా అలవాటు పడ్డారో తెలియజేసే మరో ఘటన హైదరాబాద్‌, పాతబస్తీలో జరిగింది. ఓ దొంగ ఎవరూ లేని ఓ ఇంట్లో జొరబడి బంగారు ఆభరణాలు, నగదు మూటకట్టుకున్నాడు. కానీ బయలుదేరే ముందు గంజాయి కొట్టడంతో మత్తులోకి జారుకుని అక్కడే నిద్రపోయాడు. మర్నాడు ఉదయం ఇంటి యజమాని లోనికి వచ్చి చూస్తే నగదు, బంగారు ఆభరణాలతో నిద్రపోతున్న దొంగ కనిపించడంతో షాక్ అయ్యాడు. అతనిని నిద్రలేపి వస్తువులు తీసుకొని పోలీసులకు అప్పజెప్పాడు. 

నగర కమీషనర్‌ విసి సజ్జనార్‌ గంజాయి సరఫరా ముఠాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఇటీవలే ప్రకటించారు. బహుశః ఆ ప్రయత్నంలోనే ఈగల్ పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో తనికీలు, విద్యార్ధులకు వైద్య పరీక్షలు చేసి ఉండవచ్చు. 

Related Post