ఐ యామ్ గేమ్: కొత్త రిలీజ్ డేట్ ఇదే!

August 13, 2026


img

దుల్కర్ సల్మాన్  నటిస్తున్న ‘ఐ యామ్ గేమ్’ సినిమా విడుదల వాయిదా పడింది. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను మొదట ఈ నెల 20న ఓణం పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో సినిమాను సెప్టెంబర్ 3కి వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

చెప్పిన సమయానికి సినిమా విడుదల చేయలేకపోతున్నందుకు అభిమానులకు క్షమాపణలు చెప్తూ, ‘ఆట మరింత పెద్దది కాబోతోందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించేందుకే రిలీజ్‌ను వాయిదా వేసినట్లు’ నిర్మాతలు తెలిపారు. సినిమా కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సివచ్చినా సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించేచి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా కాయదు లోహర్ నటిస్తున్నారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: నహాస్ హిదాయత్, స్క్రీన్‌ప్లే: సజీర్ బాబా, బిలాల్ మొయిదు, ఇస్మాయిల్ అబూబక్కర్, డైలాగ్స్: ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్, కెమెరా: జిమ్షీ ఖాలిద్, ఎడిటింగ్: చమన్ చక్కో చేశారు. 

వేఫేర్ ఫిల్మ్స్ సమర్పణలో దుల్కర్ సల్మాన్, జోమ్‌ వర్గీస్ కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష