ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. హిందూ ధర్మం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసే వారిలో కొందరు దొంగలు కూడా ఉన్నారని, ఆ నినాదం ముసుగులో కొందరు దాడులకు పాల్పడుతున్నారని అనసూయ గతంలో చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.
“నేను చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించి చెడుగా ప్రచారం చేస్తున్నారు కనుక వివరణ ఇస్తున్నంటూ అనసూయ మరో వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు.
కేవలం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం కాదు. వ్యక్తి ప్రవర్తనే ముఖ్యం. సనాతన ధర్మం పేరుతో దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నించాను. తప్ప హిందూ మతాన్ని కించపరచలేదు.
నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను. నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని. నా ధర్మం, విలువలు, విశ్వాసాలపై నాకు ఎలాంటి సందేహం లేదు. నా వ్యాఖ్యల్లోని అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదు.
నేను నిత్యం శ్రీరాముడిని కొలుస్తాను. ఆయనపై ఉన్న భక్తితోనే నా పెద్ద కుమారుడికి హనుమంతుడి పేరు పెట్టుకున్నాను కూడా. అలాంటి నేను శ్రీరాముడిని హిందూ మతాన్ని ఎందుకు కించపరు’స్తాను?ఈ పేరుతో దాడులు చేస్తున్న వారి గురించే నేను మాట్లాడాను తప్ప అందరి గురించి కాదు. జై శ్రీరామ్,” అని అనసూయ అన్నారు. ఆమె తాజా వివరణతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందా? చూడాలి.