ట్రాఫిక్‌లో కేసీఆర్‌ కాన్వాయ్‌!

August 14, 2026


img

మాజీ సిఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేడు అనారోగ్యంతో చనిపోయిన తన బామర్ది జోగినిపల్లి శ్రీనివాస్‌రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు అల్వాల్ బయలుదేరారు. ఆయన కాన్వాయ్‌ శామీర్‌పేట చేరుకునప్పుడు అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. 

శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న రైతులు రోడ్డు బైతాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేసీఆర్‌ కాన్వాయ్‌ దానిలో చిక్కుందని తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి కేసీఆర్‌ కాన్వాయ్‌ని పంపించారు. 

జోగినిపల్లి శ్రీనివాస్‌రావు అనారోగ్యంతో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటికే హరీష్‌ రావుతో పలువురు బీఆర్ఎస్‌ పార్టీ నేతలు అల్వాల్ చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. 

బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కూడా కిటకిటలాడుతోంది. అధినేత కేసీఆర్‌ వస్తున్నారని తెలిసి మరింత మంది అక్కడకు చేరుకుంటున్నారు. కనుక అక్కడా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు.


Related Post